
సీరియల్ నటుడు మహేశ్‌బాబు కాళిదాస్ (Mahesh Babu Kalidasu), నటి సాండ్రా జైచంద్రన్ (Sandra Suhasini Jaichandran) త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా కలిసుంటున్న వీరు ఇటీవలే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అందరూ అనుకుంటున్నట్లు తాము లవ్‌లో ఉన్నామని వెల్లడించారు. జీవితాంతం ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఒక్కసారి ప్రపోజ్ చేయలేదు
అలా అన్నారో లేదో, ఇంతలోనే ఓ షోలో కుటుంబసమేతంగా ఇద్దరూ స్టేజీ ఎక్కారు. సాండ్రా పల్లకిలో రాగా.. నాకు కాబోయే శ్రీమతిని మా ఇంటికి తీసుకొస్తున్నా అంటూ ఆనందపడిపోయాడు మహేశ్. స్టేజ్‌పై రెండు కుటుంబాల సమక్షంలో ప్రియురాలు సాండ్రాకు ఉంగరం తొడిగాడు మహేశ్. ఒక్కసారి కూడా తనకు ప్రపోజ్ చేయలేదంటూ తొలిసారి ఐ లవ్యూ చెప్పి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సీరియల్‌తో ప్రయాణం మొదలు
ఇకపోతే మహేశ్.. మనసిచ్చి చూడు, శుభస్య శీఘ్రం సీరియల్స్‌లో హీరోగా నటించాడు. సాండ్రా జైచంద్రన్.. ముద్దమందారం, కలవారి కోడళ్ళు సహా పలు సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఆటో విజయశాంతి ధారావాహికలో నటిస్తోంది. శుభస్య శీఘ్రం సీరియల్‌లో ఇద్దరూ కలిసి పనిచేసిన సమయంలోనే ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఈ ధారావాహిక పూర్తయిన తర్వాతే వీరిద్దరూ SaMa ప్రయాణం అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇద్దరూ కలిసి ట్రిప్పులు, సరదా వీడియోలు పోస్ట్ చేసేవారు. ఇకపోతే సాండ్రాకు 19 ఏళ్లకే పెళ్లయింది. భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలిసి విడాకులు తీసుకుంది.
చదవండి: నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్