
– రాశీ
‘‘ప్రేయసి రావే’ చిత్రంలో పాత్ర పరంగా హీరో శ్రీకాంత్‌ని కొట్టాను. ఆ సినిమా హిట్ అయ్యింది. అలాగే ‘ఉసురే’లో హీరోని, హీరోయిన్‌ని కొట్టాను. నాకున్న సెంటిమెంట్ ప్రకారం ‘ఉసురే’ కూడా హిట్ అవుతుంది. ఈ సినిమాలో నా పాత్ర చూసి అందరూ ఆశ్చర్య పోతారు. అందరి హృదయాలను మా చిత్రం హత్తుకుంటుంది’’ అని నటి రాశీ తెలిపారు. టి. అరుణాచలం, జననీ కునశీలన్ జోడీగా రాశీ ముఖ్యపాత్ర పోషించిన చిత్రం ‘ఉసురే’.
నవీన్ డి. గోపాల్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణ ప్రోడక్షన్స్ సమర్పణలో మౌళి ఎం. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. కిరణ్ జోజ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో నవీన్ డి. గోపాల్ మాట్లాడుతూ– ‘‘కమల్‌హాసన్‌గారికి మా సినిమా ట్రైలర్ చూపించాను. ఆయనకు బాగా నచ్చింది. ఈ సినిమా హిట్టవ్వాలని ఆయన ఆకాంక్షించారు’’ అన్నారు. ‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్యూని మా చిత్రంలో చర్చించాం. ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునే ప్రేమకథ ఇది’’ అని మౌళి ఎం. రాధాకృష్ణ చె ప్పారు.