breaking news
Usure Movie
-
నేను కొడితే హిట్టే
‘‘ప్రేయసి రావే’ చిత్రంలో పాత్ర పరంగా హీరో శ్రీకాంత్‌ని కొట్టాను. ఆ సినిమా హిట్ అయ్యింది. అలాగే ‘ఉసురే’లో హీరోని, హీరోయిన్ని కొట్టాను. నాకున్న సెంటిమెంట్ ప్రకారం ‘ఉసురే’ కూడా హిట్ అవుతుంది. ఈ సినిమాలో నా పాత్ర చూసి అందరూ ఆశ్చర్య పోతారు. అందరి హృదయాలను మా చిత్రం హత్తుకుంటుంది’’ అని నటి రాశీ తెలిపారు. టి. అరుణాచలం, జననీ కునశీలన్ జోడీగా రాశీ ముఖ్యపాత్ర పోషించిన చిత్రం ‘ఉసురే’. నవీన్ డి. గోపాల్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణ ప్రోడక్షన్స్ సమర్పణలో మౌళి ఎం. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. కిరణ్ జోజ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో నవీన్ డి. గోపాల్ మాట్లాడుతూ– ‘‘కమల్‌హాసన్‌గారికి మా సినిమా ట్రైలర్ చూపించాను. ఆయనకు బాగా నచ్చింది. ఈ సినిమా హిట్టవ్వాలని ఆయన ఆకాంక్షించారు’’ అన్నారు. ‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్యూని మా చిత్రంలో చర్చించాం. ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునే ప్రేమకథ ఇది’’ అని మౌళి ఎం. రాధాకృష్ణ చె ప్పారు. -
రియలిస్టిక్ లవ్‌స్టోరీగా 'ఉసురే'.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా 'ఉసురే' ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్ డి.గోపాల్ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేస్తున్నారు మేకర్స్. సీనియర్ హీరోయిన్ రాశి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌ను చూస్తుంటే ఇదొక సహజమైన, వైవిధ్యమైన ప్రేమకథలా అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. ప్రముఖ హీరోయిన్ రాశి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని అర్థమౌతుంది. యథార్థ సంఘటనల ప్రేరణగా రూపొందిన ఈ ప్రేమకథ అందరి హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుందని, ముఖ్యంగా నేటి యువతకు ఈ సినిమా ఎంతో బాగా నచ్చుతుందని తెలుస్తోంది. ఇకదర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ '' ట్రైలర్‌కు ఎంతో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ నటన, వారి మధ్య వచ్చే సంభాషణలు ఎంతో రియల్స్టిక్గా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ. ఎంతో రియలిస్టిక్ అప్రోచ్‌తో ఈ ప్రేమకథ అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సమాజంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. రొమాన్స్, కామెడి, డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి అంశం ఎంతో ఆస్తకికరంగా, ఉత్కంఠగా ఉంటుంది.కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది' అన్నారు.