అందుకు భిన్నంగా ఈ సిరీస్‌లో చేశా: సమంత కామెంట్స్ | Tollywood Actress Samantha Comments On Citadel Web Series | Sakshi
Sakshi News home page

Samantha: వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది: సమంత

Oct 15 2024 7:36 PM | Updated on Oct 15 2024 8:06 PM

Tollywood Actress Samantha Comments On Citadel Web Series

సమంత రూత్ ప్రభు, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ- బన్నీ. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈవెంట్‌లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నపై సామ్ ఈ విధంగా స్పందించింది.

సమంత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే కొంత మార్పులు వచ్చాయి. అందులో నేనూ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. స్పై జానర్‌లో సిరీస్‌, సినిమా అయినా సరే ఎప్పటికీ పురుషులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. వారికే యాక్షన్‌, డైలాగ్స్‌ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా ఈ సిరీస్‌లో నేను కూడా యాక్షన్‌ చేశా అని తెలిపింది.

కాగా..  ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్ కీలక పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ సిటాడెల్‌. దీనికి ఇండియన్‌ వెర్షన్‌ సిటాడెల్‌: హనీ -బన్నీ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్‌, డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement