ప్ర‌జ‌ల్లో మార్పు రావాల‌ని చెప్పే చిత్రమే "జ‌నం"! | Sakshi
Sakshi News home page

Suman: ఆ సినిమా జ్ఞాప‌కాలు క‌ళ్ల ముందు క‌దిలాయి: సుమన్

Published Mon, Sep 25 2023 9:38 PM

Tollywood Actor Suman Released Political Movie Janam Trailer  - Sakshi

సుమ‌న్, అజ‌య్ ఘోష్, కిషోర్, వెంక‌ట ర‌మ‌ణ‌, ప్ర‌గ్య‌ నైనా  ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం జ‌నం.  వెంక‌ట ర‌మ‌ణ ప‌సుపులేటి స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో వీఆర్‍పీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు సుమ‌న్,అజయ్ ఘోష్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌సత్య‌నారాయ‌ణ‌, సాయి వెంక‌ట్, ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర , ద‌ర్శ‌క నిర్మాత ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ పాల్గొన్నారు.

న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ...'ఈ సినిమా ఒంగోలులో షూటింగ్ చేశాం.  నేటి భారతం కూడా అక్క‌డే షూటింగ్ జ‌రిగింది. ఆ సినిమా జ్ఞాప‌కాలు క‌ళ్ల ముందు క‌దిలాయి. అదే కోవ‌లో వ‌స్తోన్న చిత్రం జ‌నం. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న క‌రప్ష‌న్ తో పాటు అన్యాయాలు, అక్ర‌మాల గురించి ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా చూపించారు. సందేశంతో పాటు మంచి ఎంట‌ర్ టైన్ మెంట్ కూడా ఉంటుంది. ఈ త‌రం పిక్చ‌ర్స్ వారి చిత్రాలు ఎలా ఉంటాయో అలా  ఈ చిత్రం కూడా ఉంటుంది. ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో ఈ చిత్రం రావ‌డం గొప్ప విష‌యం. ప్ర‌జ‌ల్లో మార్పు రావాల‌ని చెప్పే చిత్రం " జ‌నం" అని అన్నారు.

ద‌ర్శక, నిర్మాత ప‌సుపులేటి వెంకట ర‌మ‌ణ మాట్లాడుతూ....'న‌టుడు సుమన్‌తో దేశంలో  దొంగ‌లు ప‌డ్డారు చిత్రానికి ప‌ని చేశాను. అప్ప‌టి నుంచి వారితో మంచి ప‌రిచయం ఉంది. జ‌నం చిత్రాన్ని రెండు పార్ట్ లుగా చేస్తున్నా. నిజాయితీకి..ప్ర‌జా స్వామ్యానికి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. ఒంగోలులో సినిమా అంతా పూర్తి చేశాం. త్వ‌ర‌లో  చిత్రాన్ని విడుద‌ల  చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. పొలిటీషియ‌న్స్‌తో పాటు జ‌నానికి కూడా ఈ చిత్రంలో చుర‌క‌లు అంటించాం.' అని అన్నారు. కాగా... ఈ చిత్రంలో ప్ర‌గ్నా గౌత‌మ్, సుజాత‌, జ‌య‌వాణి, ఆదిత్య‌, నాగేంద్ర‌, క్రిష్‌, ల‌క్కీ, సింధు, రిషిత త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  సంగీతం రాజ్ కిర‌ణ్ అందిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement