ఆయన వల్లే ఇక్కడున్నా.. పుష్ప-2 విషయంలో బాధలేదు: అజయ్ ఘోష్ | Tollywood Actor Ajay Ghosh ON sukumar Puishpa 2 Movie | Sakshi
Sakshi News home page

నా పని అయిపోయిందనుకున్నా.. ఆయన వల్లే ఫామ్‌లోకి వచ్చా: అజయ్ ఘోష్

Jun 3 2024 4:45 PM | Updated on Jun 3 2024 4:45 PM

Tollywood Actor Ajay Ghosh ON sukumar Puishpa 2 Movie

అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్‌ విపరీతమైన స్పందన వస్తోంది.

‍అయితే ఈ చిత్రంలో టాలీవుడ్‌ నటుడు అజయ్ ఘోష్‌  కీలక పాత్ర పోషించారు. కొండారెడ్డి పాత్రలో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన మ్యూజిక్‌ షాప్‌ మూర్తి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పుష్ప-2లో తాను లేకపోవడంపై స్పందించారు. సుకుమార్‌ తన జీవితాన్ని మార్చారని అ‍న్నారు.  తన కెరీర్‌ అయిపోయిందనుకున్న దశలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని తెలిపారు.

అజయ్ ఘోష్ మాట్లాడుతూ..' నా దృష్టిలో సుకుమార్ కేవలం డైరెక్టర్ మాత్రమే‌ కాదు. నేనేంటో తెలిసేలా చేసిన గురువు. కరోనా బారిన పడినప్పుడు  కెరీర్‌ ముగిసిందనుకున్నా. పుష్పలో నటించేందుకు సుకుమార్‌ అడిగితే నా వల్ల కాదని చెప్పా. అయినా ఆయన వదల్లేదు. చాలాసేపు మాట్లాడి ఒప్పించారు. ఆయన మోటివేషన్‌తోనే నటనకు సిద్ధమయ్యా. పుష్ప-2లో నటించకపోవడంపై నాకే లాంటి బాధలేదు. నా కోసం మరో అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తారు సుకుమార్.' అని అన్నారు. కాగా..శివ పాలడుగు దర్శకత్వంలో మ్యూజిక్‌ షాప్‌ మూర్తి ఈ నెల 14న థియేటర్లో రిలీజ్ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement