బర్త్‌ డే కానుక? | Sakshi
Sakshi News home page

బర్త్‌ డే కానుక?

Published Mon, Dec 4 2023 12:55 AM

Thalaivar 170 First Look Poster Release Date - Sakshi

రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్, రానా, ఫాహద్‌ ఫాజిల్, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ  ప్రస్తుతం చెన్నైలో జరుగుతోందని, రజనీకాంత్‌– ఫాహద్‌ కాంబినేషన్‌లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌.

అయితే ఈ సినిమా టీజర్‌ విడుదలకు వేళ అయిందట. ఈ నెల 12న రజనీకాంత్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్‌ ఉన్నట్లు కోలీవుడ్‌ సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారని, ఫేక్‌ ఎన్‌కౌంటర్స్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. లైకా ప్రోడక్షన్స్‌పై సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమా అప్‌డేట్‌ కూడా ఈ నెల 12న రావొచ్చని టాక్‌.

Advertisement
 
Advertisement