ముగిసిన ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ఎన్నికలు | Telugu Film Producer Council Election Updates | Sakshi
Sakshi News home page

Telugu Film Producer Council: ముగిసిన ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

Feb 19 2023 10:19 AM | Updated on Feb 19 2023 3:19 PM

Telugu Film Producer Council Election Updates - Sakshi

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి.  ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు  ఫిల్మ్‌ ఛాంబర్‌ వేదికగా ఈ ఎన్నికలు జరిగాయి. నిర్మాత మండలిలో మొత్తం 1134 మంది ఉండగా.. 678 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో దిల్ రాజు, సి కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి, మైత్రి రవి కిరణ్, స్రవంతి రవి కిషోర్, ఠాగూర్ మధు సునీల్ కుమార్ రెడ్డి, నాగబాబు, అశ్వినిదత్,  తదితరులు ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది. 

అధ్యక్ష బరిలో నిర్మాతలు దామోదర ప్రసాద్‌, జెమినీ గణేష్‌లు ఉన్నారు. దామోదర ప్రసాద్‌కు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మద్దతు ప్రకటించగా.. జెమినీ కిరణ్‌కు సీ.కల్యాణ్‌ కల్యాణ్‌ మద్దతు తెలిపారు. ప్రొగ్రెసివ్‌ ప్రొడ్యూసర్‌ ప్యానెల్‌ పేరుతో దామోదర ప్రసాద్‌.. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ప్యానెల్‌ పేరుతో జెమినీ కిరణ్‌ బరిలోకి దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement