గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ | Telugu Actress Richa Pallod Latest Pics Family Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: అప్పట్లో వరస హిట్ సినిమాలు.. ఇప్పుడు మాత్రం ఇలా

May 3 2024 7:32 PM | Updated on May 3 2024 7:57 PM

Telugu Actress Richa Pallod Latest Pics Family Details

టాలీవుడ్‌లో హీరోయిన్లు గురించి చెప్పమంటే పోతే రోజులు పట్టేస్తాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. ఉన్నవాళ్లు వెళ్లిపోతూనే ఉంటారు. ఈ బ్యూటీది కూడా అలాంటి స్టోరీనే. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ ఇక్కడ కొన్ని సినిమాలతో అద్భుతమైన హిట్స్ అందుకుంది. కానీ ఎందుకో కెరీర్ ని సరిగా సెట్ చేసుకోలేక ఫేడౌట్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?)

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు రిచా పల్లోడ్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు ఊహించింది కరెక్టే. దాదాపు 24 ఏళ్ల క్రితం వచ్చిన 'నువ్వే కావాలి' సినిమాలో హీరోయిన్‌గా చేసింది ఈమెనే. ఈ మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కానీ తర్వాత చేసిన హోళీ, చిరుజల్లు, ప్రేమతో రా, నా మనసిస్తా రా, పెళ్లాం పిచ్చోడు, 'ఇంకోసారి' తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే ఇవి అనుకున్నంత హిట్ అవ్వలేదు.

చివరగా 2016లో వచ్చిన 'మలుపు' అనే డబ్బింగ్ సినిమాలో రిచా.. సహాయ పాత్రలో నటించింది. రిచా ఫ్యామిలీ విషయానికొస్తే.. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ భామ.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు మూవీస్ చేసింది. అయితే సినిమాలు తగ్గడంతో 2011లో హిమాన్షు బజాబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం భర్తతో కలిసి ఉంటున్న రిచా.. ఒకప్పటితో పోలిస్తే ఛార్మ్ తగ్గిపోయింది. దీంతో గుర్తుపట్టేలేనంతగా మారిపోయింది. 

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement