Sakshi News home page

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్

Published Sat, Mar 23 2024 3:41 PM

Telangana Press Academy Chairman Srinivas Reddy Speech At TFJA  Event - Sakshi

 తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి హామీ

అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలంతో పాటు హెల్త్‌ కార్డు, అక్రిడేషన్‌ కార్డులు అందించే ప్రయత్నం చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. శనివారం ఆయన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA) ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహించిన  హెల్త్ కార్డ్, డైరీ, ఐడికార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ..గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం తనకు నమ్మకం ఉందని, కచ్చితంగా అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

‘తెలంగాణ‌లో 23వేల మంది అక్రిడేటెడ్ జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. ప్ర‌తి సంస్థ‌లోనూ ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేకంగా అక్రిడేష‌న్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఎలిజెబుల్ పీపుల్‌కి క‌చ్చితంగా అక్రిడేష‌న్ ఇప్పిస్తాం. ప్ర‌భుత్వాల నుంచి ఏ సౌక‌ర్యాలు పొందాల‌న్నా అంద‌రిలోనూ యూనిటీ ఉండాలి. అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేసేది ఒక‌టే. మ‌న ప్రొఫెష‌న్ విలువ‌, స్టాండ‌ర్డ్ ఆఫ్ జ‌ర్న‌లిజం, ఎథిక్స్ ని ఎథిక్స్ ని ఇంకా పెంచుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. ప్ర‌భుత్వం మీద నాకు న‌మ్మ‌కం ఉంది. జూన్ 6 త‌ర్వాత ఎలిజిబుల్ జ‌ర్న‌లిస్టుల‌కు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థ‌లాలు, అక్రిడేష‌న్ కార్డులు అందించే ప్ర‌య‌త్నం చేస్తాం.ప్ర‌భుత్వాల నుంచి కూడా ఏదీ ఫ్రీగా ఎక్స్ పెక్ట్ చేయొద్దు. భూముల‌నో, ఫ్లాట్‌ల‌నో మార్కెట్ రేటు కాకుండా, మ‌న‌కంటూ ఓ రేటుకి ఇస్తే దాన్ని కట్టుకుందాం’ అన్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు, టీఎఫ్‌జెఎ అధ్య‌క్షుడు ల‌క్ష్మీ నారాయ‌ణ‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె.రాంబాబు, ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు స‌హా అసోసియేష‌న్ స‌భ్యులు.. జ‌ర్న‌లిస్ట్‌లు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement