
తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని, సినిమా టికెట్ల ధరలూ పెంచబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' కోసం తెలంగాణ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'పుష్ప2' బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ కూడా జీవచ్ఛవంలా ఉన్నాడు. ఆ సమయంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుష్ప2 ఘటన తర్వాత అల్లు అర్జున్‌పై చాలా తీవ్రంగా ట్రోల్‌కు గురయ్యాడు. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు అతనిపై విరుచుకపడ్డారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. 'ఇకపై తెలంగాణలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవు. నేను సీఎంగా ఉన్నంత కాలం ఎట్టిపరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం సినిమా వాళ్ల ఆటలు సాగనివ్వను. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి. కానీ, మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకునేది లేదు. చట్టం అందరికీ ఒక్కటే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.' సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు వీరమల్లు కోసం తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంపు, బెనిఫిట్ షోల కోసం అనుమతి ఇచ్చేయడం పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది.
రోహిన్ రెడ్డి వల్లే టికెట్లకు హైక్ వచ్చింది: ఏఎం రత్నం
తెలంగాణలో 'హరిహర వీరమల్లు' సినిమాకు టికెట్ ధరలు పెంపు, బెనిఫిట్ షో రావడం పై నిర్మాత ఏఎం రత్నం పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రీసెంట్‌గా జరిగిన ఘటన (పుష్ప2) వల్ల తమకు మొదట రేట్లు ఇవ్వలేదని అన్నారు. 'రోహిన్ రెడ్డి వల్ల మా సినిమా టికెట్ హైక్‌కు అనుమతి వచ్చింది. ఆయన వల్లే బెనిఫిట్ షో కూడా వచ్చేసింది.' అన్నారు. రోహిన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉంటారని గుర్తింపు ఉంది. 2023లో అంబర్ పేట నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. గతంలో ఆయన నిర్మాతగా సాయి ధరమ్ తేజ్‌తో 'తిక్క' అనే సినిమాను నిర్మించారు.
తెలంగాణలో బెనిఫిట్ పొందిన రీసెంట్ చిత్రాల ధరలు ఇలా..
కల్కి 2898 ఏ.డీ
సింగిల్ స్క్రీన్ 265/-
మల్టీప్లెక్స్ 413/-
దేవర
సింగిల్ స్క్రీన్ 295/-
మల్టీప్లెక్స్ 413/-
పుష్ప2
సింగిల్ స్క్రీన్ 354/-
మల్టీప్లెక్స్ 531/-
గేమ్ ఛేంజర్
సింగిల్ స్క్రీన్ 277/-
మల్టీప్లెక్స్ 445/-
హరిహర వీరమల్లు
సింగిల్ స్క్రీన్ 354/-
మల్టీప్లెక్స్ 531/-
జులై 23న రాత్రి 9గంటలకు ప్రీమియర్ షో.. టికెట్ ధర: రూ.600+ జీఎస్టీ
రేవంత్ రెడ్డి దోస్త్ వల్ల తెలంగాణలో సినిమా టికెట్ హైక్ అనుమతి వచ్చింది
అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటన తరువాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వదు అనుకున్నాం
రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ద్వారా మాకు టికెట్ హైక్, ప్రీమియర్ షో లకు అనుమతి వచ్చింది https://t.co/sHu3NXTxPt pic.twitter.com/LizKBQtOwA— Telugu Scribe (@TeluguScribe) July 21, 2025