
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఇటీవలె ఈ చిత్రం నుంచి తొలి పాట ‘దాక్కో దాక్కో మేక..’ విడుదలై విషయం తెలిసిందే. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను తెలుగులో శివం ఆలపించారు. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తున్న ఈ పాట ఇప్పటివరకు 14 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తుంది.
తాజాగా ఈ మూవీ యూనిట్ నుంచి ప్రేక్షకులకు మరో ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ సాంగ్‌లోని ‘ఆహ్.. ఆహ్..’ అంటూ సాగే బిట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయాల్సిందిగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కాగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.
#AhAhAhStep - #Pushpa - Start creating Reels on @instagram Now 🔥🥁#DaakkoDaakkoMeka #OduOduAadu #OduOduAade #JokkeJokkeMeke #JaagoJaagoBakrehttps://t.co/sKMVFlfQon
— Pushpa (@PushpaMovie) August 16, 2021