Taraka Ratna death: ఎన్టీఆర్‌ 30 వాయిదా

Taraka Ratna death: NTR 30 launch postponed - Sakshi

‘జనతా గ్యారేజ్‌’(2016) వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్‌– డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకి ఈ నెల 24న కొబ్బరికాయ కొట్టాల్సింది. అయితే హీరో తారకరత్న మృతితో నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ కారణంగా ఎన్టీఆర్‌– కొరటాల శివ తాజా చిత్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది.

నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్‌ మిక్కిలినేని నిర్మించనున్న ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో 30వ మూవీ. ఈ నెలలో షూటింగ్‌ ప్రారంభించి, మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టి, 2024 ఏప్రిల్‌ 5న ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు ‘అమిగోస్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ స్వయంగా ప్రకటించారు. కాగా తాజాగా తారకరత్న మృతితో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్రబృందం ప్రకటిస్తూ ట్వీట్‌ చేసింది. ఇక ‘ఎన్టీఆర్‌ 30’తో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్‌. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top