స్టార్ హీరో వింటేజ్ లుక్.. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.. గుర్తుపట్టారా? | Sakshi
Sakshi News home page

Guess The Hero: వెరైటీ సినిమాలు చేసే స్టార్ హీరో.. తెలుగులో వేరే లెవల్ క్రేజ్

Published Fri, Feb 23 2024 9:26 PM

Tamil Actor Suriya Vintage Pic Went Viral - Sakshi

కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన హీరోల‍్ని కూడా వాళ్ల పాత ఫొటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే అంత మార్పు ఉంటుంది మరి. ఈ హీరో కూడా సేమ్ అలాంటోడే. పైన కనిపిస్తున్న ఫొటో అలాంటిదే. ఇతడు తెలుగోడు కానప్పటికీ మన దగ్గర వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిట్ ఫ్లాప్ అనేది పక్కనబెడితే ప్రతి మూవీతో మెస్మరైజ్ చేస్తుంటాడు. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన కనిపిస్తున్న హీరో పేరు సూర్య. అవును మీలో చాలామంది ఊహించింది కరెక్టే. ఇతడు అసలు పేరు శరవణన్ శివకుమార్. తండ్రి శివకుమార్ నటుడు కావడంతో ఇండస్ట్రీ గురించి కాస్తోకూస్తో తెలుసు. కానీ నేరుగా హీరో అయిపోలేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎవరనేది చెప్పకుండా బట్టల ఫ్యాక్టరీలో చాలా తక్కువ జీతానికి కొన్నినెలల పాటు పనిచేశాడు. ఫలానా నటుడి అబ్బాయి అని తెలిసిపోవడంతో అక్కడ పనిమానేశాడు. కెరీర్ ప్రారంభంలో నటుడిగా పలు విమర్శలు ఎదుర్కొన్నాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలనే సామెతకి తగ్గట్లు నటుడిగా తనని తాను మెరుగుపెట్టుకుంటూ వెళ్లాడు. కాకా, మౌనం పెసియాదే, పితాగమన్, గజిని లాంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గజిని' సినిమా అయితే తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్‌హిట్‌గా నిలచింది. ఆ తర్వాత 7th సెన్స్, వీడొక్కడే, 24, 'సింగం' సిరీస్ చిత్రాలతో.. చాలామంది తెలుగు స్ట్రెయిట్ హీరోల కంటే ఎక్కువ స్టార్‌డమ్ సంపాదించాడు. త్వరలో 'కంగువ' అనే చిత్రంతో రాబోతున్నాడు.

సూర్య ఫ్యామిలీ విషయానికొస్తే.. తనతో పాటు కలిసి హీరోయిన్‌గా చేసిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం హీరో కమ్ నిర్మాతగా సూర్య అదరగొట్టేస్తుంటే.. జ్యోతిక కూడా నటిగా రీఎంట్రీ ఇచ్చి హిందీ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించేస్తోంది. తాజాగా ఒకానొక సందర్భంగా సూర్య పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైన ఉన్న ఫొటో అదే. తొలుత చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ సూర్యలో అంత తేడా ఉంది మరి!

(ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement