Tamannaah Gets Overwhelmed As Fan Gets Her Face Tattooed And Touches Her Feet, Video Viral - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: వీడియో చూస్తుంటే ఏడుపొస్తుందంటున్న ఫ్యాన్స్‌

Jun 27 2023 10:26 AM | Updated on Jun 27 2023 10:52 AM

Tamannaah Gets Overwhelmed Fan Gets Tattooed And Touches Her Feet - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. బాలీవుడ్‌ నటుడు విజయ​ వర్మతో ప్రేమ వ్యవహారం నిజమేనని తను ఎప్పుడైతే ఒప్పుకుందో  ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. విజయ్‌ వర్మ విషయంలో తన నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నా మరికొందరు తనకు సపోర్టుగా నిలుస్తాన్నారు.  దీంతో తమన్నాకు ఎక్కడికెళ్లిన అభిమానుల తాకిడి ఎక్కువైంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఒక అభిమానితో తమన్నా చాలా క్లోజ్‌గా  ఇంటరాక్ట్ అయ్యింది.

(ఇదీ చదవండి: మొబైల్‌తో ఇబ్బంది పడుతున్నాను.. ఆషూ రెడ్డి వీడియో విడుదల)

దీంతో ఆ అభిమాని  భావోద్వేగానికి గురయ్యారు.  తమన్నాను కలిసిన తర్వాత ఆ వ్యక్తి ఆమె పాదాలను తాకారు. అనంతరం ఒక బొకేతో పాటు లేఖను కూడా మిల్కీ బ్యూటీకి ఇచ్చారు. అపై తన చేతిపై పచ్చబొట్టు కూడా చూపించడంతో తమన్నా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. టాటూలో 'లవ్ యు ది తమన్నా' అనే పదంతో పాటు తమ్ము ఫోటోను అభిమానంతో వేపించుకున్నారు. అనంతరం ఆ అభిమానిని తమన్నా కౌగిలించుకుని  చాలాసార్లు 'ధన్యవాదాలు' అని చెప్తూనే కారులోకి వెళ్లింది.

(ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు)


అభిమానుల స్పందన

అయ్యో ఈ వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది. అభిమానుల పట్ల తమన్నా చూపించే ప్రేమ ఎలా ఉంటుందో.. ఈ వీడియో చూస్తే చాలంటూ ఒక ఫ్యాన్‌ కామెంట్‌ చేశాడు. తను బంగారం లాంటి వ్యక్తి 13 ఏళ్లుగా తెలుసు.. అభిమానులను చాలా గౌరవంగా భావింస్తుంది అంటూ తమన్నాను పలు అభినందనీయమైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Advertisement
 
Advertisement
Advertisement