నన్ను అలా ఎవరైనా పిలుస్తే.. చాలా ఇష్టం: తమన్నా | Tamannaah Bhatia Comments On Her Milky Beauty Tagline | Sakshi
Sakshi News home page

నన్ను అలా ఎవరైనా పిలుస్తే.. చాలా ఇష్టం: తమన్నా

Apr 23 2025 7:03 AM | Updated on Apr 23 2025 7:05 AM

Tamannaah Bhatia Comments On Her Milky Beauty Tagline

హీరోయిన్‌గా తమన్నా రెండు దశాబ్దాలుగా రాణిస్తుంది. హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లో పలు చిత్రాలు చేసి అగ్ర కథానాయకిగా మెప్పిస్తుంది. మధ్య మధ్యలో ప్రత్యేక పాటల్లో నటిస్తున్నా అవి ఆమె కెరీర్‌కు ప్లస్‌ అయ్యాయే కానీ ఎలాంటి నష్టాన్ని తీసుకురాలేదు. మరోవైపు ఇప్పటికీ కథానాయకిగా ఛాన్సులు కూడా దక్కించుకోవడం విశేషం. ఈ అమ్మడు బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో పడిన తర్వాత కాస్త అవకాశాలు తగ్గినా.. ఆమె క్రేజ్‌ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇందుకు కారణం ఆమె ఇప్పటికీ ఐటమ్‌ సాంగ్స్‌కు స్పెషలిస్ట్‌ అనిపించుకోవడమే. 

ఈమె హిందీలో ప్రత్యేక పాటలో నటించిన స్త్రీ చిత్రం కానీ, తమిళంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన జైలర్‌ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో పాటు గెస్ట్‌గా నటించిన పాత్ర కానీ ఆ చిత్రాల విజయాలకు కొమ్ము కాశాయని చెప్పక తప్పదు. చాలా కాలం నుంచి ఈమెను అందరూ మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. అందుకు తగిన గ్లామర్‌ ఆమెలో ఉందని కూడా చెప్పవచ్చు. 

ఇటీవల ఒక సమావేశంలో తమన్నా మాట్లాడుతూ.. మిల్కీ బ్యూటీ అనే పట్టం తనకు మొదట్లో అభిమానులు ఇచ్చారని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత మీడియా దాన్ని ఎక్కువగా వాడటంతో ఆ పదం చాలామందికి దగ్గరైంది. దానివల్ల తాను ఇబ్బందులు పడ్డానని అనుకున్నారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదు. అలా పిలుస్తే ఎవరికి ఇష్టం ఉండదొ చెప్పండి అంటూ నవ్వేసింది. అదేవిధంగా అందంగా ఉండడంతోనే మంచి అవకాశాలు తనకు రాలేదని గుర్తుచేసింది. తాము పనిచేస్తోంది రంగుల ప్రపంచంలో అని, ఇక్కడ అందుకు తగ్గట్టుగా అందంగా ఉండాలని, అందుకోసమే తాను నిరంతరం ప్రయత్నిస్తున్నానని తమన్నా పేర్కొంది. తాజాగా కథానాయకిగా నటించిన తెలుగు ఓదెల–2  ఇటీవల తెరపైకి వచ్చింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement