‘రియా చక్రవర్తి ఎవరో నాకు నిజంగా తెలియదు’

Taapsee Pannu On Rhea Chakraborty: I Really Did Not Know Her At All - Sakshi

ముంబై : యువ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ కేసుతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకంపై ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్‌ కేసును డ్రగ్‌ కోణంలో విచారిస్తున్న ఎన్‌సీబీ ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌లతోపాటు డ్రగ్స్‌ను సరాఫరా చేసే కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. అదే క్రమంలో ఈ విషయంపై కంగనా రనౌత్‌కు.. ముంబై ప్రభుత్వం, .బీటౌన్‌ సెలబ్రిటీలకు మధ్య రచ్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో మారుతున్న పరిణామాలపై స్పందించిన తాప్సీ పన్ను.. రియా, కంగనా, జయా బచ్చన్‌ గురించి మాట్లాడారు. కాగా గతంలో తాప్సీ, రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తాప్సీ చర్చించారు. (సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు)

‘రియా చక్రవర్తి ఎవరో నాకు నిజంగా తెలియదు. నేను కేవలం రియాకు జరుగుతున్న అన్యాయానికి, ఆమెపై ఇచ్చిన తీర్పును గురించే మాట్లాడుతున్నాను. ఇది కేవలం కొత్తది కాదు. ఇంతకముందు ఇతర పరిశ్రమల నుంచి అనేక తప్పులు జరిగాయి. మా పరిశ్రమలో(సినీ పరిశ్రమ)కూడా కొంత మంది పెద్ద స్టార్లు తప్పులు చేశారు. కానీ ఎవరిని రియా మాదిరి శారీరకంగా, మానసికంగా హింసిస్తూ చిత్రీకరించి చూపించలేదు. ఇది నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అందుకే ఆమె గురించి నాకు ఏమి తెలియకుండానే మాట్లాడాల్సి వచ్చింది. నా అభిప్రాయానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. అలాగే కోర్టు, దర్యాప్తు సంస్థలు తమ తీర్పును ఇవ్వక ముందే తమకు ఇష్టం వచ్చినట్లు రాసే వ్యక్తులు ఉన్నారు. వారు తమ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరిపై ప్రభావితం చేసేలా బలవంతం చేయాలనుకుంటున్నారు. అది తప్పు అని నేను అనుకుంటున్నాను. రియా చక్రవర్తి జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా లేదా నేరస్థులు జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా..’ అని ప్రశ్నించారు. (రియాకు మంచు ల‌క్ష్మి, తాప్సీ మ‌ద్ద‌తు)

అలాగే రాజ్యసభ్యలో జయా బచ్చన్‌ ఇచ్చిన ప్రసంగాన్ని తాప్సి ప్రశంసించారు. ఆమె ప్రతి విషయాన్నా చాలా ఖచ్చితంగా చెప్పారని, ఈ రోజు తను చెప్పబోయే అనేక విషయాలు ఇప్పటికే జయా బచ్చన్‌ చెప్పేసారని అన్నారు. ఇక కంగనా రనౌత్‌ గురించి మట్లాడుతూ..కంగనా వ్యాఖ్యలు ఎప్పటి నుంచో తనపై ప్రభావం చూపడం ఆగిపోయిందన్నారు. ‘ఓకే వ్యక్తి తరచూ ఒకేలా మాట్లాడితే కొన్ని రోజులకు వారి మాటలు ఎవరిపై ప్రభావం చూపించలేవు. అలాగే కంగన మాటలు కూడా న్ను  ఏ విధంగానే కదిలించలేవు’ అని తాప్సీ అన్నారు. (డ్రగ్‌ కేసు: త్వరలో సారా, రకుల్‌కు సమన్లు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top