రియాకు మంచు ల‌క్ష్మి, తాప్సీ మ‌ద్ద‌తు

Lakshmi Manchu And Taapsee Pannu Supports Rhea Chakraborty - Sakshi

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కేసులో అంద‌రి వేళ్లు అత‌ని ప్రియురాలు, న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి వైపే చూపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు కుమార్తె, న‌టి మంచు ల‌క్ష్మి రియాకు మ‌ద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జ‌ర‌గాల‌ని వాదిస్తున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఆదివారం #JusticeForSushantSinghRajput, #JusticeForRheaChakraborty అంటూ ఓ పోస్ట్ పెట్టారు. "రియా చ‌క్ర‌వ‌ర్తిని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ చేసిన‌ ఇంట‌ర్వ్యూ మొత్తం చూశాను. ఆ త‌ర్వాత‌ దీనిపై స్పందించాలా? వ‌ద్దా? అని చాలా ఆలోచించాను. కానీ ఇప్ప‌టికే మీడియా ఆమెను రాక్ష‌సిగా చిత్రీక‌రిస్తోంది. చాలామంది దీనిపై మౌనంగా ఉన్నారు. నాకు నిజం ఏంటో తెలీదు, కానీ నిజాన్ని తెలుసుకోవాల‌నుకుంటున్నాను. అదే స‌మ‌యంలో నిజం ఎలాగైనా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నా. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై పూర్తి విశ్వాసం ఉంది. అన్ని ర‌కాల‌ ద‌ర్యాప్తు సంస్థ‌లు సుశాంత్‌కు న్యాయం తీసుకువ‌చ్చేందుకు పాటుప‌డుతున్నాయి. (ఆ రెండు ప్ర‌శ్న‌లకు రియా స‌మాధానం?)

అప్ప‌టివ‌ర‌కు మ‌న‌మంతా స‌హ‌నం పాటించాలి. ఇత‌రుల‌ను ద్వేషించ‌డం మానుకోవాలి. నిజానిజాలు తెలుసుకోకుండా ఆమె కుటుంబానిపై నింద‌లు వేయ‌డం త‌గ‌దు. మీడియా వ‌ల్ల ఆమె కుటుంబం ఎంత బాధ‌ప‌డుతున్నారనేది నేను అర్థం చేసుకోగ‌ల‌ను. నాకు కూడా ఇలాంటివి ఎదురైతే ఒక్క‌సారైనా నా స‌హ‌చ‌రులు నావైపు నిల‌బ‌డాలి. నిజం బ‌య‌ట ప‌డేంత‌వ‌ర‌కు ఆమెను ఒంట‌రిగా వ‌దిలేయండి. నేను ఆమెకు మ‌ద్ద‌తు ఇస్తున్నాను" అని పేర్కొన్నారు. దీనికి రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ స్పందిస్తూ 'గొప్ప‌గా చెప్పారు' అని ట్వీట్ చేశారు. అలాగే హీరోయిన్ తాప్సీ కూడా రిప్లై ఇచ్చారు. "నాకు వ్య‌క్తిగ‌తంగా సుశాంత్ పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు, రియా కూడా అంత‌గా తెలీదు. తెలిసింద‌ల్లా ఒక్క‌టే.. నేరం నిరూపణ అవ‌క‌ముందే ఓ వ్య‌క్తిని దోషిగా నిల‌బ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం త‌ప్పు. చ‌ట్టాన్ని ప్ర‌తి ఒక్క‌రూ విశ్వ‌సించండి" అని ట్వీట్ చేశారు. (రకుల్‌ ప్రీత్‌, మంచు లక్ష్మి సైక్లింగ్‌ ఫోటోలు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top