అతన్ని సాధారణ మనిషిలాగే భావించా..చూడగానే ప్రేమ పుట్టలేదు: తాప్సీ | Taapsee Says It Was Not Love At First Sight With Mathias Boe, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

అతన్ని సాధారణ మనిషిలాగే భావించా..చూడగానే ప్రేమ పుట్టలేదు: తాప్సీ

Published Sun, Jun 9 2024 8:51 AM | Last Updated on Sun, Jun 9 2024 2:21 PM

Taapsee Pannu, Mathias Boe Was Not Love At First Sight

తమిళసినిమా: ఒకరిపై ప్రేమ కలగడానికి సరైన నిర్వచనం ఉండదు. కొందరు చూడగానే నచ్చేస్తారు. మరి కొందరు వారి ప్రవర్తన కారణంగా ప్రేమించబడతారు. మరొకరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ప్రేమలో పడతారు. ఇలా ప్రేమలో చాలా కోణాలు ఉంటాయి. కాగా తాప్సీ ఎలా ప్రేమలో పడ్డారో చూద్దాం. 

ఢిల్లీలో పుట్టి పెరిగన బ్యూటీ తాప్సీ. తొలుత బాలీవుడ్‌లో నటిగా పరిచయమైన, పాపులరైంది మాత్రం దక్షిణాది చిత్రాలతోనే. తెలుగులో జుమ్మందినాథం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, తమిళంలోకి ఆడుగళం చిత్రంతో దిగుమతయ్యారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా స్టార్‌ హీరోలతో జతకట్టి పేరు తెచ్చుకున్నారు. 

ఆ తరువాత హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే ఎక్కువగా దృష్టి పెట్టారు. హిందీలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. కాగా ఈమె డెన్మార్క్‌కు చెందిన మాథియస్‌ బో అనే బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడితో ప్రేమలో మునిగి తేలుతున్నారు. 

పెళ్లికి మాత్రం ఇంకా చాలా టైమ్‌ ఉందంటున్న చెబుతూ వచ్చిన తాప్సీ సమీప కాలంలో రహస్యంగా ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. కాగా తన ప్రేమ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుపుతూ తనకు మాథియస్‌ను చూడగానే, ఒక నెల తరువాతనో ప్రేమ పుట్టలేదన్నారు. ఆయన్ని చూడగానే గౌరవం ఏర్పడిందన్నారు. ఆయన్ని ఒక సాధారణ మనిషిగానే భావించానని చెప్పారు. ఆ తరువాత తరచూ కలుసుకునేవారిమని చెప్పారు. 

అలా ఆయన్ని ప్రేమించడం మొదలెట్టానని, అయితే వెంటనే మాథి యస్‌ బోకు తన ప్రేమను వ్యక్తం చేయలేదని, అందుకు చాలా కాలం తీసుకున్నానని చెప్పారు. ప్రేమ పెళ్లి విధానం వర్కౌట్‌ అవుతుందా? అని కూడా ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పా రు. చివరికి తనకు కావలసిన వ్యక్తిని కనుగొన్నానన్న భావన కలగడంతో ఇద్దరం ప్రేమించుకోవడం మొదలెట్టామని తాప్సీ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement