యాక్షన్‌ గాంధారి | Taapsee Pannu to Lead Action Thriller Gandhari | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ గాంధారి

Sep 11 2024 12:30 AM | Updated on Sep 11 2024 12:30 AM

Taapsee Pannu to Lead Action Thriller Gandhari

తాప్సీ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రానికి ‘గాంధారి’ టైటిల్‌ ఖరారు చేశారు మేకర్స్‌. యాక్షన్  థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవాశిష్‌ మఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. ‘గాంధారి’ సినిమాకు కనికా థిల్లాన్  కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్‌ సమాచారం.

కాగా తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్‌ కథ అందించిన ‘హసీనా దిల్‌రుబా’, ‘ఫిర్‌ ఆయీ హసీనా దిల్‌ రుబా’లకు వీక్షకుల నుంచి మంచిపాజిటివ్‌ రెస్పాన్స్ లభించింది. దీంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్‌లో అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ‘గాంధారి’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ΄్లాట్‌ఫామ్‌లో త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement