అష్టకర్మకు అష్టావధాని టీఆర్‌ పాట! | T Rajendar Sing Song On Ashtakarma Movie | Sakshi
Sakshi News home page

Ashtakarma Movie: అష్టకర్మకు అష్టావధాని టీఆర్‌ పాట!

Feb 6 2022 12:30 PM | Updated on Feb 6 2022 12:30 PM

T Rajendar Sing Song On Ashtakarma Movie - Sakshi

తమిళ సినీపరిశ్రమలో అష్టావధానిగా పేరుగాంచిన టి.రాజేందర్‌ అష్టకర్మ చిత్రం కోసం పాట రాసి స్వయంగా పాడారు. కిషన్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఇందులో నందినీరాయ్‌, శ్రద్ధ నాయికలు..

తమిళ సినీపరిశ్రమలో అష్టావధానిగా పేరుగాంచిన టి.రాజేందర్‌ అష్టకర్మ చిత్రం కోసం పాట రాసి స్వయంగా పాడారు. సీఎస్‌ పదమ్‌చంద్‌, సి. హరిహంద్‌ రాజ్‌, కిషన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషన్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఇందులో నందినీరాయ్‌, శ్రద్ధ నాయికలు.

విజయ్‌ తమిళ్‌ సెల్వన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఎల్వీ ముత్తు, ఎల్వీ గణేశ్‌ సంగీతాన్ని అందించారు. ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. దీనికి ప్రమోషన్‌ పాటను టి. రాజేందర్‌ పాడటం సంతోషంగా ఉందని దర్శకుడు విజయ్‌ తమిళ్‌ సెల్వన్‌, కథానాయకుడు కిషన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement