సుడల్‌ తెలుగు ట్రైలర్‌ విడుదల చేసిన నాగచైతన్య | Suzhal: The Vortex Season 2 Telugu Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

సుడల్‌ తెలుగు ట్రైలర్‌ విడుదల చేసిన నాగచైతన్య

Feb 19 2025 1:45 PM | Updated on Feb 19 2025 1:49 PM

Suzhal: The Vortex Season 2 Telugu Official Trailer Out Now

తమిళ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'సుడల్‌: ది వోర్టెక్స్‌' (Suzhal The Vortex) వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh), కదీర్‌ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్‌ సిరీస్‌ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లోకి రానుంది. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను టాలీవుడ్‌ హీరో నాగచైతన్య విడుదల చేశారు. 2022లో విడుదలై తమిళ వెబ్‌ సిరీస్ ‘సుడల్‌: ది వొర్టెక్స్‌’ సీక్వెల్‌గా పార్ట్‌2 తెరకెక్కింది. బ్రహ్మ జి - అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించగా.. విక్రమ్‌ వేదా చిత్రం ఫేమ్‌ గాయత్రి పుష్కర్‌ల ద్వయం నిర్మించింది. ఇందులో  కదీర్‌, ఐశ్వర్యా రాజేశ్‌, ఆర్‌.పార్తిబన్‌, హరీశ్‌ ఉత్తమన్‌, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement