8 Thottakkal Movie Remake In Telugu: సుష్మిత చేతిలోకి ఎనిమిది బుల్లెట్లు - Sakshi
Sakshi News home page

Sushmita Konidela: సుష్మిత చేతిలోకి ఎనిమిది బుల్లెట్లు

Apr 29 2021 8:29 AM | Updated on Apr 29 2021 11:26 AM

Sushmita Konidela To Remake 8 Thottakkal in Telugu - Sakshi

హీరో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత.. తమిళ సినిమా ‘8 తూట్టాక్కళ్‌’ (8బుల్లెట్లు) అనే సినిమా రీమేక్‌ హక్కులు కొన్నారట.

హీరో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత  కొన్ని రోజుల క్రితం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. ఇప్పుడు సినిమా నిర్మించనున్నారట. తమిళ సినిమా ‘8 తూట్టాక్కళ్‌’ (8బుల్లెట్లు) అనే సినిమా రీమేక్‌ హక్కులు కొన్నారట.

వెట్రి, అపర్ణా బాలమురళి జంటగా శ్రీ గణేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017లో  విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. తెలుగు రీమేక్‌లో ఓ యువ హీరో నటించనున్నారట. పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement