సుశాంత్‌ కేసు: రియా పిటిషన్‌పై 5న విచారణ

Sushanth SIngh Case Supreme Court likely to Hear Rhea Chakraborty Plea On 5th August - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య ఘటన వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు నిష్పక్షపాతంగా విచారణ జరపించాలని డిమాండ్‌ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా సుశాంత్‌ ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తి, ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. జూలై 25న సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ రియాపై  పట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆమె ఏమో కేసు దర్యాప్తును పట్నా నుంచి ముంబై పోలీసులకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. (చదవండి: సుశాంత్‌, అలియా మధ్య పోటీ, గెలిచేదెవరు?)

మరోవైపు రియా చక్రవర్తి పిటిషన్‌ను ఆగష్టు 5న సుప్రీం కోర్టు విచారించనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ హృషికేశ్ రాయ్ సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించనుంది. సుశాంత్‌ ఆత్మహత్యతో తీవ్ర మనస్తాపానికి గురైన తనపై ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే చంపేస్తాం, అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని వాపోయారు. ముందస్తు నోటీసు లేకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఉండటానికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో ఒక దావా వేసింది.  ముంబై పోలీసులు ఎంతో సమర్థత కలిగిన వారని, ఈ కేసును విచారించగలరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు.  
(చదవండి : సుశాంత్‌ కేసు: మహారాష్ట్ర వర్సెస్ బిహార్)

ఎం.ఎస్. ధోనీ లాంటి బ్లాక్‌ బ్లస్టర్‌ చిత్రంలో నటించిన సుశాంత్.. జూన్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్‌పుత్ కుటుంబం, అతని కుక్‌తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసిశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top