'హిట్ లిస్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య | Surya Released Hit List Movie First Look | Sakshi
Sakshi News home page

'హిట్ లిస్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య

May 13 2024 9:11 AM | Updated on May 13 2024 9:11 AM

 Surya Released Hit List Movie First Look

దర్శక నటుడు కేఎస్‌.రవికుమార్‌ నిర్మిస్తున్న మూడో చిత్రం హిట్‌లిస్ట్‌. ఈ సంస్థలో ఇంతకు ముందు కమలహాసన్‌ 'తెనాలి', ఈ మధ్య 'గూగుల్‌ కుట్టప్పా' అనే సినిమాల్ని నిర్మించారు. తాజాగా 'హిట్‌లిస్ట్‌' పేరుతో మూవీ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విక్రమన్‌ వారసుడు విజయ్‌ కినిష్కాను హీరోగా పరిచయం చేస్తున్నారు. సూర్య కథీర్‌, కే. కార్తీకేయన్‌ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ కుమార్‌, కేఎస్‌ రవికుమార్‌, గౌతమ్‌మీనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!)

నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ట్రైలర్‌ ఇటీవలే విడుదలై మంచి స్పందనను తెచ్చుకుందని, తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నటుడు సూర్య ఆవిష్కరించి యూనిట్‌ వర్గాలకు శుభాకాంక్షలు అందించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా రెడీ చేశామని, త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేస్తామని నిర్మాత కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement