డైరెక్టర్‌ సూర్యకిరణ్ మృతిపై సుజిత ఎమోషనల్ | Surya Kiran Sister Sujatha Emotional Words Now | Sakshi
Sakshi News home page

నువ్వు నా హీరో, తండ్రి కూడా.. సూర్యకిరణ్ మృతిపై సుజిత ఎమోషనల్

Mar 15 2024 4:35 PM | Updated on Mar 15 2024 5:38 PM

Surya Kiran Sister Sujatha Emotional Words Now - Sakshi

టాలీవుడ్‌ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్‌ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇప్పటికే సూర్యకిరణ్‌ గురించి ఆయన సన్నిహితులు పలు విషయాలను పంచుకుని బాధపడ్డారు కూడా. తాజాగా ఆయన సోదరి సుజిత రియాక్ట్‌ అయ్యారు.

సూర్య కిరణ్‌కు సోదరి సుజిత అంటే చాలా ఇష్టం.. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా అన్నయ్య పట్ల సుజిత కూడా అమితమైన ప్రేమను చూపించేవారు. అలాంటిది నేడు సూర్యకిరణ్‌ లేడన్న నిజాన్ని తట్టుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ఆయన నా అన్నయ్య మాత్రమే కాదు.. నా హీరో, నాకు తండ్రి కూడా.. ఇండస్ట్రీలో నీ టాలెంట్‌కు, నీ మాటలకు నేను ఎప్పుడూ అభిమానినే. మరో జన్మంటూ ఉంటే.. అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.' అంటూ సుజిత ఎమోషనల్ అయ్యారు. 

పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగారు. చిన్నప్పుడు వారు తండ్రిని కోల్పోవడంతో ఒక నాన్నలా తమ కుటుంబాన్ని సూర్యకిరణ్‌ పోషించారని గతంలో సుజిత చెప్పారు. ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్‌లో నటిస్తూ హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యారు. తమ మధ్య 8 ఏళ్లు గ్యాప్‌ ఉండటంతో ఎంతో ప్రేమగా అన్నయ్య చూసుకునేవారని ఆమె పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement