
తానిప్పుడు సూర్య కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సూర్య కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత తన దర్శకత్వంలో ఆయన నటిస్తారని పేర్కొన్నారు. కాగా ఈ
కోలీవుడ్ కథానాయకులు తెలుగు చిత్రాల్లో నటించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. నట దిగ్గజం శివాజీ గణేషన్ నుంచి తాజాగా ధనుష్ వరకు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అలరించిన వారే. ఇందులో నటుడు కార్తీ, విజయ్ వంటి వారు కూడా ఉన్నారు. ఐతే నటుడు సూర్య మాత్రం నేరుగా తెలుగు చిత్రాల్లో ఇంతవరకు నటించనేలేదు. కానీ ఈయన నటించిన పలు తమిళ చిత్రాలు ఇక్కడ అనువాదం అయ్యి విజయం సాధించాయి.
అయితే సూర్యను తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అది త్వరలోనే జరగబోతుందనేది తాజా సమాచారం. ఇటీవల కార్తికేయ– 2 చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో సూర్య నటించడానికి సమ్మతించినట్లు ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను చెప్పిన సింగిల్ లైన్ స్టోరీ సూర్యకు నచ్చినట్లు పేర్కొన్నారు.
ఆయన తరచూ తనకు ఫోన్ చేసి కథ గురించి అడుగుతున్నారని చెప్పారు. తానిప్పుడు సూర్య కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సూర్య కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత తన దర్శకత్వంలో ఆయన నటిస్తారని పేర్కొన్నారు. కాగా ఈయన సూర్య కోసం సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అవుతుందని భావించవచ్చు. కాగా ప్రస్తుతం చందు మొండేటి నటుడు నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు.
చదవండి: National film awards 2023: జాతీయ అవార్డుల జాబితా ఇదే!