సూర్య 'కంగువా'.. ఆ సీన్‌ కోసం ఏకంగా పదివేలమందిని! | Suriya and Bobby Deol Biggest War Sequence With Huge People | Sakshi
Sakshi News home page

Kanguva : కంగువా మేకర్స్‌ భారీ ప్లాన్‌.. ఏకంగా పదివేల మందితో వార్‌ సీన్‌..!

Published Fri, May 17 2024 5:13 PM | Last Updated on Fri, May 17 2024 5:49 PM

Suriya and Bobby Deol Biggest War Sequence With Huge People

కోలీవుడ్ స్టార్‌ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా.  శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్‌ షూట్‌ చేసినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్‌కు కళ్లు చెదిరే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement