సూర్య 40వ చిత్రంలో సామూహిక అత్యాచార ఘటన? | Suriya 40: Real Incident In This Movie | Sakshi
Sakshi News home page

Suriya 40: సినిమాలో పొల్లాచ్చి ఘటన?

Jun 27 2021 9:28 AM | Updated on Jun 27 2021 9:28 AM

Suriya 40: Real Incident In This Movie - Sakshi

హీరో సూర్య, దర్శకుడు పాండిరాజ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది నటుడు సూర్య 40వ చిత్రం. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను, చిత్ర టైటిల్‌ను జూలై నెలలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు పాండిరాజ్‌ ఇటీవల ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇందులో మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలను వేటాడి శిక్షించే యువకుడి పాత్రలో సూర్య నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య పొల్లాచ్చిలో జరిగిన సామూహిక అత్యాచారాల ఘటన ఈ చిత్రంలో ఉన్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

ఇదిలా వుంటే తెలుగులోనూ మార్కెట్‌ ఏర్పరుచుకున్న సూర్య ఇక్కడి ప్రేక్షకులను నేరుగా పలకరించాలనుకుంటున్నారట. ఇందుకోసం తెలుగు స్టార్‌ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమాకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి ఇదెంతవరకు నిజమో త్వరలోనే తేలనుంది.

చదవండి: కరోనా ఎఫెక్ట్‌ : తన ఫ్యాన్స్‌ కోసం సూర్య ఏం చేశాడంటే...

Advertisement
 
Advertisement
Advertisement