అమీషాపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసు.. కీలక ఆదేశం ఇచ్చిన సుప్రీం కోర్టు

Supreme Court Stays Proceedings Against Actress Ameesha Patel For Cheating Case - Sakshi

బాలీవుడ్‌ నటి అమీషా పటెల్‌ చీటింగ్‌ కేసులో జార్ఖండ్‌ ట్రయల్‌ కోర్టు జారీ చేసిన సమన్లకు సంబంధించి క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ను సుప్రీం కోర్టు నిలివేసింది. అమీషా పటెల్‌ తనని మోసం చేసిందంటూ నిర్మాత వేసిన పటిషన్‌పై జార్ఖండ్‌ కోర్టు ఆమెకు మేలో సమన్లు ఇచ్చింది. దీంతో తనపై ఈ క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ను నిలివేయాలని కోరుతూ అమీషా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

చదవండి: నటుడు బ్రహ్మాజీ సటైరికల్‌ ట్వీట్‌.. అనసూయను ఉద్ధేశించేనా?

తన పటిషన్‌పై విచారణ జరిపిన బిఆర్‌ గవాయ​, పిఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం తాజాగా జార్షండ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ ఇచ్చింది. అమీషాపై క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 (చెక్ బౌన్స్) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన చర్యలు చట్టానికి అనుగుణంగానే కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా అజయ్‌ సింగ్‌ అనే నిర్మాత అమీషా పటెల్‌పై జార్ఖండ్‌ ట్రయల్‌ కోర్టులో ఇటీవల చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

చదవండి: సుమన్‌ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్‌ చానళ్లకు నటుడు వార్నింగ్‌

‘దేశీ మ్యాజిక్‌’ అనే సినిమా  కోసం అమీషాకు రూ. 2.5 కోట్లు ఇచ్చానని, కానీ ఆ సినిమాలో ఆమె చేయలేదన్నాడు. అడ్వాన్స్‌గా ఇచ్చిన ఆ డబ్బును అమీషా తిరిగి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇక దీనిపై విచారించిన జార్ఖండ్‌ ట్రయల్‌ కోర్టు అమీషాపై చీటింగ్‌(420), నేరపూరిత విశ్వాస ఉల్లంఘన(420) సెక్షన్ల కింద ఆమెకు సమన్లు ఇచ్చింది. దీంతో అమీషా జార్ఖండ్‌ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయగా దానిని విచారించిన ధర్మాసనం సెక్షన్‌ 138 ప్రకారం ప్రొసీడింగ్‌లు జరపాలని జార్ఖండ్‌ కోర్టును ఆదేశించింది.

చదవండి: చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్‌, వీడియో షేర్‌ చేసిన మెగాస్టార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top