నటుడు బ్రహ్మాజీ సటైరికల్‌ ట్వీట్‌.. అనసూయను ఉద్ధేశించేనా? | Brahmaji Sarcastic Reply to Netizen Comment Who Calls Him Uncle | Sakshi
Sakshi News home page

Actor Brahmaji Tweet: వైరల్‌గా బ్రహ్మాజీ సటైరికల్‌ ట్వీట్‌.. అది అనసూయకు చురకా?

Published Wed, Aug 31 2022 5:03 PM | Last Updated on Wed, Aug 31 2022 5:16 PM

Brahmaji Sarcastic Reply to Netizen Comment Who Calls Him Uncle - Sakshi

నటుడు బ్రహ్మాజీ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తన ట్వీట్‌పై ఓ నెటిజన్‌ అంకుల్‌ అని కామెంట్స్‌ చేయగా బ్రహ్మాజీ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ట్వీట్‌ చూస్తుంటే ఇది యాంకర్‌ అనసూయను ఉద్ధేశించి చేసినదేనంటూ నెటిజన్లతో పాటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ అభిమానులకు టచ్‌ ఉంటాడు బ్రహ్మాజీ. ఈ క్రమంలో వెరైటీగా సెల్ఫీ తీసుకున్న బ్రహ్మాజీ ఆ ఫొటోను షేర్‌ చేస్తూ ‘వాట్‌ హ్యాపెనింగ్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. ఎప్పటి లాగే ఆయన ఫ్యాన్స్‌, నెటిజన్లు ఈ ట్వీట్‌పై రకరకాలుగా స్పందిస్తుండగా.. ఓ నెటిజన్‌ మాత్రం ‘ఏం లేదు అంకుల్‌’ అని కామెంట్‌ చేశాడు. 

చదవండి: యాంకర్‌ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్‌ అట

ఆ కామెంట్‌ను బ్రహ్మాజీ రీట్వీట్‌ చేస్తూ... ‘అంకుల్‌ ఏంట్రా అంకుల్‌.. కేసు వేస్తా.. బాడీ షేమింగ్‌ చేస్తున్నావా?’ అంటూ నవ్వుతున్న ఏమోజీని జత చేశాడు. దీంతో ఈ ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. బ్రహ్మజీ రియాక్షన్‌పై ఫ్యాన్స్‌ సరదగా స్పందిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. గుడ్‌ టైమింగ్‌ అంటూ కొందరు నెటిజ్లను ఆయనను ప్రశంసిస్తుంటే మరికొందరూ అనసూయను ఉద్ధేశిస్తూ ఆయన ట్వీట్‌పై కామెంట్స్‌ చేస్తున్నారు. ‘అన్న.. ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారు.. స్రీన్‌ షాట్స్‌ తీసి సీఎం, పీఎంకి కేసు వేస్తుంది’, ‘ఏంటి అంకుల్‌ నువ్వు కూడానా’, ‘ఏం లేదు అంకుల్‌.. ఆంటీ అల్రెడీ వేశారుగా కేసు’ అంటూ మరోసారి అనసూయను టార్గెట్‌ చేస్తున్నారు నెటిజన్లు. 

చదవండి: సుమన్‌ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్‌ చానళ్లకు నటుడు వార్నింగ్‌

అంతేకాదు ‘ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదు’ అని ‘#SayNotToOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్‌ మర్చిపోయారు అంకుల్’ ఇలా సటైరికల్‌గా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల అనసూయను ఆంటీ అంటూ ట్విటర్‌లో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. తనని ట్రోల్‌ చేస్తూ చేసిన ప్రతి కామెంట్‌పై అనసూయ స్పందించడంతో ఆమెపై మరింత నెగిటివిటి పెరిగింది. దీంతో తనని ఆంటీ అంటూ ట్రోల్‌ చేసిన ట్వీట్స్‌ను స్క్రీన్‌ షాట్స్‌ తీసి రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అనసూయ. అయినప్పటికీ తనపై ట్రోల్స్‌ అగడం లేదు. ఇప్పుడు బ్రహ్మాజీ చేసిన ఈ సటైరికల్‌ ట్వీట్‌ అనసూయను ఉద్ధేశించి ఉండటంతో ఇది కాస్తా చర్చనీయాంశమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement