Super Star Mahesh Babu Sponsors Vaccination Drive For Burripalem Village On Super Star Krishna Birthday - Sakshi
Sakshi News home page

Mahesh Babu: గొప్పతనం చాటుకున్న స్టార్‌ హీరో

May 31 2021 5:44 PM | Updated on May 31 2021 6:03 PM

Super Star Mahesh Babu Sponsors Vaccination Drive For Burripalem Village On Super Star Krishna Birthday - Sakshi

టీ​కా అనేది మళ్లీ సాధారణంగా జీవించడానికి అవసరమైన ఆశాకిరణం వంటిది. బుర్రిపాలెం ప్రజలు టీకా వేసుకుని సురక్షితంగా ఉండాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నమిది..

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు తన తండ్రి కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుని సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేశ్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్‌ -19 టీకా డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాడు. బుర్రిపాలెంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందిస్తున్నామని మహేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఆంధ్రా హాస్పిటల్స్‌ సహకారంతో ఈ డ్రైవ్‌ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపాడు.

"టీ​కా అనేది మళ్లీ సాధారణంగా జీవించడానికి అవసరమైన ఆశాకిరణం వంటిది. బుర్రిపాలెం ప్రజలు టీకా వేసుకుని సురక్షితంగా ఉండాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నమిది. ఈ టీకా డ్రైవ్‌ ఏర్పాటుకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు, క్లిష్ట కాలంలో స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించిన టీమ్‌ మహేశ్‌బాబు సభ్యులకు ప్రత్యేక అభినందనలు" అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా మహేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఈ రెండు ఊర్లను అభివృద్ధి చేసే బాధ్యతలను తన భుజాల మీద వేసుకోవడమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిజమైన శ్రీమంతుడిగా ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నాడు.

చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్‌

‘టైటానిక్‌’ మూవీ హీరోయిన్‌తో పోల్చుకున్న యంగ్‌ హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement