సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్‌

Milind Soman Asks Woman To Do Push Ups For Selfie - Sakshi

సెలబ్రిటీలు అన్నాక సెల్ఫీలు అడగడం కామన్‌. ముఖ్యంగా సిని పరిశ్రమకు చెందిన ప్రముఖులు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు జనాలు. వాళ్లు కూడా సాధ్యమైనంత వరకు అభిమానుల కోరిక మేరకు సెల్ఫీలు ఇచ్చి వెళ్లిపోతారు. కానీ ఓ నటుడు మాత్రం తనను సెల్ఫీ అడిగిన ఓ మహిళతో పుషప్‌లో చేయించాడు. ఆయన చేసింది మంచి పనే అయినా.. ఇప్పుడు ట్రోలింగ్‌కి గురయ్యాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

ఇండియన్ టాప్‌ మోడల్, నటుడు మిలింద్ సోమన్ గురించి అందరికి తెలిసిందే.  80, 90 దశకాల్లో టాప్ మోడల్ ఆయన. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు.  53 ఏళ్ల మిలింద్..  మూడేళ్ల క్రితం తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆయన తరచుగా తన సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యం సూత్రాలు పంచుతూ ఫిట్నెస్ను ప్రోత్సహిస్తారు. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ఫిట్నెస్ చిట్కాలు పంచుకుంటూ ఉంటాడు కూడా. ఆయన ఇటీవల ఒక పాత వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 

ఆ వీడియోలో సెల్ఫీ అడిగిన మహిళను 10 పుషప్‌లు చేయమని అడగడంతో ఆమె వెంటనే పుషప్‌లు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మిలింద్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని ఓ ప్లేస్ లో సెల్ఫీ అడిగిన ఆమెను ఇలా చేయించానని చెప్పుకొచ్చాడు. తర్వాత సోమన్ ఆ మహిళతో సెల్ఫీ దిగారు.

అయితే ఆ మహిళ చీర ధరించి, అది కూడా రోడ్డు మీద పుషప్ లు చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘ఫిట్‌నెస్ కోసం పుష్-అప్‌లు చేయడం ఖచ్చితంగా మంచిదే, కానీ మీరు మీతో సెల్ఫీ తీసుకోవటానికి ఇలా ఒక స్త్రీని రోడ్డు మీద పుష్-అప్‌లు చేయించడం బాలేదు’అని ఒక నెటిజన్‌, ఢ‘శారీరక వ్యాయామం చేయాలనే మీ ఉద్దేశం చాలా గొప్పది అయితే, ముందస్తు అనుభవం లేకుండా ఈ వయసులో పుష్-అప్స్ చేయమని అకస్మాత్తుగా చెప్పడం సరికాదు’అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top