Mahesh Babu Sponsors Second Dose Of Covid 19 Vaccination Drive In His Adopte Village Burripalem Village - Sakshi
Sakshi News home page

Mahesh Babu: బుర్రిపాలెంలో మహేశ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌

Jul 11 2021 6:37 PM | Updated on Jul 12 2021 10:01 AM

Mahesh Babu Sponsors Second Dose Of Covid 19 Vaccination Drive In Burripalem Village - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు స్వస్థలం, దత్తత గ్రామం బుర్రిపాలెంలో రెండో దశ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. బుర్రిపాలెం ప్రజల కోసం మహేశ్‌ మరోసారి కోవిడ్‌ -19 టీకా డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాడు. గతంలో సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌డే సందర్భంగా మే 31న బుర్రిపాలెం ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయించిన ఈ హీరో తాజాగా రెండో డోసు అందించేందుకు సంకల్పించాడు. ఆంధ్రా హాస్పిటల్స్‌ సహకారంతో ఆదివారం నుంచి గ్రామప్రజలకు ఉచితంగా కోవిడ్‌ టీకా ఇస్తున్నారు.

కాగా మహేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే! ఈ రెండు ఊర్లను అభివృద్ధి చేసే బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్న మహేశ్‌ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిజమైన శ్రీమంతుడిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement