
సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆయన్ని.. 3వ ప్రతివాదిగా పేర్కొంటూ నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు ప్రతివాదులకు నోటీసులిచ్చిన కమిషన్.. ప్రతివాదుల హాజరు కోసం విచారణను సోమవారాని కి వాయిదా వేసింది.
సాయి సూర్య డెవలపర్స్ బాలాపూర్ గ్రామంలో లేఅవుట్ వేశామని చెప్పడంతో ఆకర్షితులైన ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి చెరో ప్లాటు కొనడానికి రూ. 34.80 లక్షలు చెల్లించారు. అయితే ప్రతిపాదిత ప్రాంతంలో లేఅవుట్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగివ్వాలని అడగ్గా సంస్థ యజమాని కంచర్ల సతీశ్‌చంద్ర గుప్తా రూ. 15 లక్షలే చెల్లించారు. బాధితులు వేసిన కేసులో సంస్థతోపాటు దాని యజమాని, ప్రచారకర్తగా ఉన్న మహేశ్‌బాబును ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం మహేష్‌బాబుకి గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది.
