టైటానిక్‌ హీరోయిన్‌తో పోల్చుకున్న హీరో కార్తీక్‌ ఆర్యన్‌

Kartik Aaryan Compares Himself With Titanic Heroine Kate Winslet  - Sakshi

బాలీవుడ్‌ యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అంతేగాక సమాజంలో జరిగే పలు విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. ఇక తన సహా నటీనటులను ఎప్పుడు ఆటపట్టిస్తూ సరదగా ఉండే కార్తీక్‌ తాజాగా టైటానిక్‌ మూవీపై స్పందిస్తూ హీరోయిన్‌ కేట్ విన్స్‌లెట్‌తో తనని పోల్చుకున్నాడు.

కాగా ఈ మూవీలో హీరోయిన్‌ కేట్‌, హీరోని తన స్కెచ్‌ వేయమని కోరుతూ నగ్నంగా సోఫాలో వాలి ఫోజు ఇస్తుంది. ఈ సనివేశం అందరికి గుర్తుంది కదా. అచ్చం కేట్‌ లాగే కార్తీక్‌ కూడా ఫోజు ఇచ్చి దిగిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోకు ‘కార్తీక్‌ 1- 0 కేట్‌ విన్స్‌లెట్‌’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు. ఇక అతడి పోస్టుపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖుల కూడా స్పందించారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ‘ఉఫ్‌’ అంటు కామెంట్‌ చేయగా.. సింగర్‌ జోనితా గాంధీ ‘ఇది ఏంటో అర్థం కానీ వ్యక్తిని నేను మాత్రమే అనుకుంటా’ అంటు కామెంట్‌ చేసింది. అది చూసిన కార్తీక్‌ ‘వెంటనే టైటానిక్‌ సినిమా చూడు’ అంటు సమాధానం ఇచ్చాడు. అలాగే నెటిజన్లు కూడా ‘టైటానిక్‌ పార్ట్‌ 2’, ‘క్యాప్షన్‌ కింగ్‌’ అంటు కామెంట్స్‌ చేస్తున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top