సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్ | Super hit Movie BALTI Telugu Trailer out now | Sakshi
Sakshi News home page

BALTI Telugu Trailer: సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్

Oct 6 2025 9:14 PM | Updated on Oct 6 2025 9:14 PM

Super hit Movie BALTI Telugu Trailer out now

షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం బల్టీ . ఇప్పటికే తమిళ, మలయాళం భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.  ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 10న టాలీవుడ్‌లో రిలీజ్ అవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ.. 'తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. క్రిటిక్స్ కూడా చక్కటి రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారు. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు షేన్ నిగమ్ ఇందులో హీరోగా అద్భుతమైన నటన కనబరిచారు. ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ నటన ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు' అని అన్నారు.

దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ..'తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జ‌రిగే ఔట్ అండ్ ఔట్ రా ర‌స్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా ఉంటుంది. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్ద‌లు వారి మ‌ధ్య జ‌రిగే వ్యాపార రాజ‌కీయాల్లో న‌లుగురు క‌బ‌డ్డీ ప్లేయ‌ర్స్ చిక్కుకోవ‌డం, ఆపై వ‌చ్చే ఘ‌ర్ష‌ణ‌లు, భావోద్వేగాల స‌మాహారంగా బ‌ల్టీ  సినిమా ఉండనుంది' అని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement