రిలీజ్‌కు రెడీ అయిన సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా మూవీ మైఖేల్‌

Sundeep Kishan Michael All Set To Release - Sakshi

నటుడు సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మైఖేల్‌. దివ్యాంష కౌషిక్‌ హిరోయిన్‌గా చేస్తున్నారు. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మీనన్, టాలీవుడ్‌ నటుడు వరుణ్‌ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసయ భరద్వాజ్, వరలక్ష్మి శరత్‌ కువర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రంజిత్‌ జయక్కొడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భరత్‌ చౌదరి, పుష్కర్‌ రామ్మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మించారు. శ్యాం సీఎస్‌ సంగీతాన్ని, కిరణ్‌ కౌశిక్‌ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియాచిత్రంగా ఫిబ్రవరి 3వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ స్థానిక చెట్‌పేట్‌లోని లేడీ అండ్‌ స్కల్‌ ఆవరణలో మీడియాసమావేశాన్ని నిర్వహింంది. దర్శకుడు రంజిత్‌ జయక్కొడి మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మైఖేల్‌ పాత్రకు ఎలాంటి ఎమోషనల్, డైలాగులు లేకుండా రూపొందించాలని భావించామన్నారు. దానికి నటుడు సందీప్‌ కిషన్‌ అద్భుతంగా నటించారన్నారు. అదేవిధంగా యాక్షన్‌ సన్నివేశాలు శక్తివంతంగా ఉండటానికి ఫైట్‌ మాస్టర్‌ చాలా శ్రమించారన్నారు.

ఇందులో ఒక క్యామియో పాత్ర ఉందని దానికి అన్ని భాషలకు తెలిసిన నటుడు అవసరమయ్యారని దీంతో తన మిత్రుడు విజయ్‌ సేతుపతిని నటించమని కోరగా ఆయన వెంటనే అంగీకరించాలని చెప్పారు. చిత్ర కథానాయకుడు సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత భరత్‌ చౌదరినే తమకు ఉద్వేగాన్ని కలిగించారన్నారు. తమ కలను ఇప్పుడు మైఖేల్‌గా మార్చింది కూడా ఆయనేనని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్‌ సీఎస్‌ ఈ చిత్రం కోసం కఠినంగా శ్రమించారని అన్నారు. దర్శకుడు రంజిత్‌ జయక్కొడి మం వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. విజయ్‌ సేతుపతి మంచి మిత్రుడు అని సందీప్‌ కిషన్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top