'సీతా కళ్యాణ వైభోగమే' ట్రైలర్ వచ్చేసింది! | Seetha Kalyana Vaibhogame Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

Seetha Kalyana Vaibhogame Trailer: 'సీతా కళ్యాణ వైభోగమే' ట్రైలర్ వచ్చేసింది!

Published Mon, Jun 10 2024 8:17 PM

Suman Tej and Garima starrer Seetha Kalyana Vaibhogame Official Trailer

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం సీతా కళ్యాణ వైభోగమే. ఈ మూవీని సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు.

హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓ మై ఫ్రెండ్ టైంలోనే సతీష్‌తో పరిచయం. ఈ మూవీ ఐడియాను ఏడాదిన్నర క్రితమే చెప్పాడు. సుమన్ ఫస్ట్ ఫిల్మ్, సతీష్ రెండో చిత్రానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి అని అన్నారు.

దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్ అందరికీ నచ్చింది. సుమన్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. చరణ్ అర్జున్ మంచి పాటలు ఇచ్చారు. నిర్మాత యుగంధర్ సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉంది. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశా. నీరూస్ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రం కోసం యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు’ అని అన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement