అర్జున్‌ను ఎవరూ ఆపలేరు.. అంచనాలు పెంచుతున్న 'హంట్‌' టీజర్‌ | Sudheer Babu Hunt Movie Teaser Out Today At AMB Cinemas | Sakshi
Sakshi News home page

Sudheer Babu Hunt Movie Teaser: సుధీర్‌ బాబు యాక్షన్ థ్రిల్లర్ 'హంట్'.. టీజర్ అవుట్

Oct 3 2022 4:08 PM | Updated on Oct 3 2022 4:12 PM

Sudheer Babu Hunt Movie Teaser Out Today At AMB Cinemas  - Sakshi

టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హంట్‌'. మహేశ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్‌ డోన్ట్‌ లై’ అనేది క్యాప్షన్‌.  పోలీసు పాత్రల్లో యాక్షన్‌ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం టీజర్‌ను రిలీజ్ చేసింది. 

'అతను అర్జున్‌ ఏ. ఇక నువ్వు ఇప్పుడు అర్జున్‌ బీ. అర్జున్ ‘ఏ’కి తెలిసిన మనుషులు, సంఘటనలు ఏమీ కూడా అర్జున్ ‘బీ’కి తెలియవు.. వారిద్దరు విభిన్న వ్యక్తులు' అంటూ మంజుల చెప్పే సంభాషణలతో టీజర్‌ ప్రారంభమైంది. అర్జున్‌ 'ఏ'కు తెలిసిన లాంగ్వేజెస్, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ ఇవన్నీ అర్జున్ 'బీ'కి కూడా ఉన్నాయి' అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

ఏ కేసునైతే ఆ అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అనే శ్రీకాంత్ డైలాగ్ మరింత హైప్ పెంచుతోంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది.  కానీ అర్జున్ 'ఎ'గా ఉండటమే అతనికి ఇష్టం! మరి అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది 'హంట్' సినిమాలో చూడాల్సిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement