టాలీవుడ్‌లో మరో నిర్మాణ సంస్థ.. ప్రారంభించిన అలీ! | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో మరో నిర్మాణ సంస్థ.. ప్రారంభించిన అలీ!

Published Thu, Mar 28 2024 7:49 PM

Star Actor and Comedian Ali Inaugurates New Banner In Tollywood - Sakshi

టాలీవుడ్‌లో మరో నూతన నిర్మాణ సంస్థ  ప్రారంభమైంది. ‘శివమ్‌ మీడియా’ పేరుతో సీనియర్‌ జర్నలిస్ట్‌ శివమల్లాల ఈ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. తాజాగా శివమ్‌ మీడియా లోగో, బ్యానర్‌ను ప్రముఖ నటుడు అలీ, నిర్మాత, దర్శకులు  ప్రవీణా కడియాల , అనిల్‌ కడియాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. 'శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుంచి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది' అని అన్నారు. అనిల్‌ కడియాల మాట్లాడుతూ– 'శివమల్లాల మాకు మంచి ఫ్రెండ్, మంచిమనిషి. అందుకే మా  జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్‌ మీడియా’ అనే బ్యానర్‌ ద్వారా సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు.

నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ.. 'ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్‌గా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తోంది. ఈ విషయంలో నేను ఎంతో  ఫీలవుతున్నా. మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 

శివమ్‌ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ.. 'నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం చాలా సంతోషం. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్‌ మీడియా బ్యానర్‌పై  మంచి సినిమాలు చేస్తా' అని అన్నారు.

Advertisement
 
Advertisement