ఆ దేశంలో రాజమౌళి క్రేజే వేరు.. ఏకంగా 83 ఏళ్ల వృద్ధురాలు! | SS Rajamouli Gets Big Surprise Gift From Old Age Fan From Japan | Sakshi
Sakshi News home page

SS Rajamouli: రాజమౌళికి డైహార్డ్ ఫ్యాన్.. ఆమె బహుమతికి దర్శకధీరుడు ఫిదా!

Mar 18 2024 9:14 PM | Updated on Mar 19 2024 10:29 AM

SS Rajamouli Gets Big Surprise Gift From Old Age Fan From Japan - Sakshi

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. నాటునాటు అనే సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్‌ చేశారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలకు ఆదరణ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి.

జపాన్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా జపనీస్‌లోనూ రిలీజ్ చేశారు. అక్కడ రాజమౌళి సినిమాకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల జపాన్‌ వెళ్లిన రాజమౌళికి ఓ మహిళ అభిమాని అరుదైన కానుక అందజేశారు. దాదాపు 83 ఏళ్ల వద్ధురాలు దర్శకధీరుడు రాజమౌళికి బహుమతులను అందజేసింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. 

రాజమౌళి ట్విటర్‌లో రాస్తూ..'జపాన్‌లో ఓరిగామి క్రేన్‌లను తయారు చేస్తారు. వారికిష్టమైన వారి ఆరోగ్యం కోసం బహుమతిగా ఇస్తారు. ఈ 83 ఏళ్ల వృద్ధురాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాంటివీ 1000 తయారు చేసింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆమెను సంతోషపెట్టింది. ఆమె ఇప్పుడే బహుమతి పంపింది. చలిలో బయట వేచి ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. అది గ్రేట్ అంతే.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్‌ బాబుతో చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement