జపాన్ వెళ్లనున్న రాజమౌళి.. వారిద్దరూ కూడా.. ఎందుకంటే? | Sakshi
Sakshi News home page

Rajamouli RRR In Japan: జపాన్ వెళ్లనున్న ఆర్ఆర్ఆర్.. అందుకోసమేనట..!

Published Wed, Sep 28 2022 3:34 PM

Rajamouli RRR Team Ready To Fly Japan For Movie Promotions - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ సంపాందించింది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21 న జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం.  ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాజమౌళి వెల్లడించారు. మూవీ ప‍్రమోషన్స్‌లో భాగంగా ఆయనతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం జపాన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.   

(చదవండి: RRR Box Office Collections: ఆగని 'ఆర్ఆర్ఆర్‌' కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే ?)

గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా జపనీస్ ప్రజలను ఆర్ఆర్ఆర్ అలరించబోతోంది. మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లోనే రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టగా.. బాలీవుడ్‌లో కూడా రూ. 300 కోట్లను వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్‌ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రూ. 1100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలిపింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement