Srikanth: అలాంటి వార్తలు వింటే చాలా బాధేస్తోంది : శ్రీకాంత్

Srikanth Clarity About Rumours Spreading his Divorce With ooha - Sakshi

టాలీవుడ్ సీనియర్‌ హీరో, నటుడు శ్రీకాంత్‌- ఊహ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్‌ కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనపై వస్తున్న రూమర్స్‌పై గతంలోనే హీరో శ్రీకాంత్‌ స్పందించారు. గురువారం మార్చి 23న శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఊహా విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాస్తున్నారని చెప్పుకొచ్చారు. 

శ్రీకాంత్ మాట్లాడుతూ..'సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌పై సోషల్‌ మీడియాలో ఎలా పడితే అలా రాసేస్తున్నారు. కొన్ని వార్తలు మరీ దారుణంగా కూడా ఉంటున్నాయి. ఒకసారి నేను మరణించినట్టు ఫొటో పెట్టేశారు. అలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది. నేను తట్టుకున్నా.. ఫ్యామిలీకి తెలిస్తే తట్టుకోలేరు. అలాంటి షాక్ న్యూస్‌ వింటే ఏదైనా అనర్థం జరగొచ్చు. అలా వార్తలు రాసేవారిలోనే మార్పు రావాలి. నేను డైవర్స్ తీసుకుంటున్నట్లు వదంతులు సృష్టించారు. వాటితో మేం కలిసి వేడుకలకు వెళ్లాల్సి వస్తోందన్నారు నవ్వుతూ. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాలంటే నా భార్యకు పెద్దగా ఇష్టముండదు. ఆ విషయం ఇండస్ట్రీలో‌ చాలామందికి తెలుసు. కోట శ్రీనివాసరావు మరణించారని రూమర్స్‌ చూసి షాక్‌కు గురయ్యా.'  అని అన్నారు. 

సీనియర్ నటుడు శ్రీకాంత్‌ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం శ్రీకాంత్ సపోర్టింగ్‌ రోల్స్‌, విలన్‌ పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన వారసుడు, హంట్‌ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. శ్రీకాంత్ ప్రస్తుతం ఆర్‌సీ15, ఎన్టీఆర్30 చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top