నాకు అహంకారం లేదు.. అలా మాట్లాడలేను: శ్రీలీల | Sreeleela Denied On Her Dance Comments | Sakshi
Sakshi News home page

అలాంటి అహంకారపు మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు: శ్రీలీల

Jun 27 2026 9:30 AM | Updated on Jun 27 2026 9:54 AM

Sreeleela Denied On Her Dance Comments

కాయలున్న చెట్టుకే రాళ్లు అంటారు. అలా వాస్తవం ఏమిటన్నది పక్కన పెడితే సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ పాపులర్‌ కళాకారులు వదంతులు ఎదుర్కోక తప్పని పరిస్థితి. వదంతుల మధ్య వాస్తవాలు మరుగున పడుతున్నారంటే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు వదంతులకు సినిమాలో ఎవరూ అతీతులు కాదు అనిపిస్తోంది. అలాంటి పరిస్థితిని శ్రీలీల ఎదుర్కొంటున్నారు. 

యూనైటెడ్‌ స్టేట్స్‌లో వైద్య విద్యను అభ్యసించిన ఈ బ్యూటీ నటిగా మాత్రం బాల్యంలోనే కన్నడంలో రంగప్రవేశం చేశారు. ఆ తరువాత కిస్‌ అనే చిత్రంలో నాయకిగా నటించారు. తెలుగులో చిత్రాంగధ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా పెళ్లి సందడి చిత్రంతో పాపులర్‌ అయ్యారు. ఆ తరువాత నటించిన ధమాకా చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందించింది. 

ఇప్పుడు శ్రీలీల క్రేజీ హీరోయిన్‌. పరాశక్తి చిత్రంతో కోలీవుడ్‌లోకి దిగుమతి అయిన ఈ బ్యూటీ బాలీవుడ్‌ను టచ్‌ చేశారు. అందంతోపాటు డాన్‌న్స్‌లోనూ యువతను గిలిగింతలు పెట్టిస్తున్నారు.  డాన్స్‌లో ప్రతిభే ఇప్పుడు ఈమెను వదంతులను గురి చేస్తోంది. డాన్స్‌తో తనతో పోటీ పడే హీరోగానీ, హీరోయిన్‌గానీ ఎవరూ లేరని శ్రీలీల అన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

ఈ ప్రచారాన్ని శ్రీలీల ఖండించారు. అలా మాట్లాడేంత అహంకారం తనకు లేదని అని స్పష్టం చేశారు. తాను అలాంటి వాతావరణంలో పెరగలేదని పేర్కొన్నారు. తాను అందరినీ గౌరవించే వ్యక్తినన్నారు. ఇలాంటి వదంతులను ప్రచారం చేసే వారు ఇకపై అయినా తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలన్నారు. తన గురించి తెలిసిన వారికి తానేమిటో తెలుసని శ్రీలీల పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement