
బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌పై మనసు పారేసుకున్నారు. వరుసగా స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కల్కి 2989 ఏడీ సినిమాతో దీపికా పదుకొణె, దేవరతో జాన్వీ కపూర్, లైగర్‌తో అనన్య పాండే.. ఇలా అక్కడి బ్యూటీలందరూ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా సోనాక్షి సిన్హ (Sonakshi Sinha) సైతం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
మహిళా దినోత్సవం సందర్భంగా..
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమా (Jatadhara Movie)లో ముఖ్య పాత్రలో నటిస్తోంది. నేడు (మార్చి 8న) మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో ఆగ్రహంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అనంత పద్మనాభస్వామి ఆలయం నేపథ్యంలో..
ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. జటాధర సినిమా కథ అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమా కోసం బాడీని పెంచే పనిలో ఉన్న సుధీర్‌బాబు అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు.
చదవండి: అది కూడా తప్పేనా? నాకు స్టార్‌గా ఉండాలని లేదు: అక్షయ్ కుమార్