ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే? | Bollywood Actress Sonakshi Sinha Buys Swanky Sea-Facing Apartment Worth Rs 11 Crore In Mumbai: Report - Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: సముద్రతీరంలో లగ్జరీ ఫ్లాట్ కొన్న సోనాక్షి.. ధర ఎంతంటే?

Sep 13 2023 1:15 PM | Updated on Oct 28 2023 1:43 PM

Sonakshi Sinha Buys New Sea-Facing Apartment For RS 11 Crore In Bandra - Sakshi

దబాంగ్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తొలి చిత్రంతోనే సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.  బాలీవుడ్ నటుడు శత్రుఘ్న‌ సిన్హా గారాల పట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.    ఈ ఏడాది  క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ దహాద్‌ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. సోనాక్షికి ఇది తొలి వెబ్‌ సిరీస్‌. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఈ దబాంగ్‌ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో వినిపిస్తోంది. 

(ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!)

 సోనాక్షి సిన్హా ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో  ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. బాంద్రా ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం సముద్ర పక్కనే ఉండడంతో సినీ ప్రముఖులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.  సోనాక్షి అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 11 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. బాంద్రాలోని ఆరియాట్ భవనంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ కోసం  రూ.55 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు తెలుస్తోంది. 

అపార్ట్‌మెంట్‌ సౌకర్యాలు

అపార్ట్‌మెంట్‌లో నాలుగు కార్లకు పార్కింగ్ సౌకర్యం,  లాబీతో పాటు ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్‌ కూడా ఉంది. 2020లో కూడా రూ. 14 కోట్లకు బాంద్రాలో విలాసవంతమైన ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

సోనాక్షి రాబోయే సినిమాలు

సోనాక్షి చివరిసారిగా విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య కలిసి నటించిన వెబ్ సిరీస్ దహాద్‌లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో నటించనుంది. దీనికి ఆమె సోదరుడు కుష్ సిన్హా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో సోనాక్షి కూడా కీలక పాత్రలో కనిపించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement