'Alia Bhatt Copying Deepika Padukone Hairstyle' Social Media Trolls Alia - Sakshi
Sakshi News home page

Alia Bhatt: ఏంటి, ఓవరాక్షనా? దీపికానే కాపీ కొడుతున్నావా? ఆలియాపై ట్రోలింగ్‌

Apr 26 2022 10:23 AM | Updated on Apr 26 2022 11:05 AM

Social Media Trolls Says Alia Bhatt Copying Deepika Padukone - Sakshi

దాన్ని ఆలియా కాపీ కొట్టిందని కామెంట్లు చేస్తున్నారు. ఏంటి దీపికానే కాపీ కొడుతున్నావా? అది దీపికా పదుకొణె హెయిర్‌ స్టైల్‌, ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నావా? అది నువ్వెందుకు వేసుకున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Alia Bhatt Copying Deepika: కొత్త పెళ్లికూతురు ఆలియా భట్‌ తిరిగి పనిలో బిజీ అయింది. ఇలా పెళ్లయిందో లేదో అలా షూటింగ్స్‌లో పాల్గొంటోంది. తాజాగా ముంబైలో ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం బయట అడుగుపెట్టిన ఆమెను సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఆదివారం నాడు రాత్రి ఆలియా ఓ ప్రకటన షూటింగ్‌లో పాల్గొంది. ఈ యాడ్‌ చిత్రీకరణ అనంతరం ఆమె తిరిగి తన కారెక్కి వెళ్లిపోయే క్రమంలో అక్కడున్న కెమెరామన్లు ఆలియాను తమ కెమెరాల్లో బంధిస్తూ పలు ఫొటోలు క్లిక్‌మనిపించారు. ఇందులో వదులైన టాప్‌ను ధరించిన ఆలియా జడ కొప్పు(స్లీక్‌ బన్‌) వేసుకుని సింపుల్‌గా ఉంది.

ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారగా ఆలియా హెయిర్‌ స్టైల్‌పై నెటిజన్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. అలా జడ పైకి ముడేసుకోవడం దీపికా పదుకొణె హెయిర్‌ స్టైల్‌ అని, దాన్ని ఆలియా కాపీ కొట్టిందని కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి దీపికానే కాపీ కొడుతున్నావా?, 'అది దీపికా పదుకొణె హెయిర్‌ స్టైల్‌, ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నావా? అది నువ్వెందుకు వేసుకున్నావు?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆలియా ఏప్రిల్‌ 14న రణ్‌బీర్‌ను పెళ్లాడి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె 'రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ' సినిమా చేస్తోంది. అటు రణ్‌బీర్‌ 'యానిమల్‌' షూట్‌లో బిజీగా ఉన్నాడు.

చదవండి 👉 ప్రశాంత్‌నీల్‌ ఎవరు? ఎక్కడి వాడు?

ఓటీటీలో కశ్మీర్‌ ఫైల్స్‌, ఎప్పుడు, ఎక్కడంటే?

Advertisement
 
Advertisement
Advertisement