చిన్న గ్యాప్‌ తర్వాత స్పీడ్‌ పెంచిన సాయిపల్లవి | SK21: Sai Pallavi Shooting in Pondicherry | Sakshi
Sakshi News home page

Sai Pallavi: చిన్న గ్యాప్‌ తర్వాత స్పీడ్‌ పెంచిన సాయిపల్లవి.. ఒకేసారి రెండు చిత్రాల్లో..

Nov 11 2023 8:32 AM | Updated on Nov 11 2023 9:05 AM

SK21: Sai Pallavi Shooting in Pondicherry - Sakshi

అలా స్టార్‌ హీరోల చిత్రాలను కూడా సున్నితంగానే తిరస్కరించారనే ప్రచారం ఉంది. అయితే తాజాగా ఓకేసారి రెండు చిత్రాలు చేస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి శివకార్తికేయన్‌ సరసన నటిస్తున్న చిత్రం. దీన్ని నటుడు కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తుండడం విశేషం. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహి

ప్రతిభకు కామా ఉంటుందే కానీ ఫుల్‌స్టాప్‌ ఉండదు. హీరోయిన్‌ సాయిపల్లవి ఈ కోవకు చెందిన నటేనని చెప్పవచ్చు. డాక్టర్‌ పట్టభద్రురాలైన ఈ తమిళ అమ్మాయి నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా, వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవడానికి సిద్ధపడడం లేదు. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రంతో అనూహ్య ప్రాచుర్యం పొందిన సాయిపల్లవికి ఆ తరువాత దక్షిణాది సినిమా ఘనస్వాగతం పలికింది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ మంచి విజయాలతో పలకరించింది. ఇక మలయాళంతో పాటు తమిళంలోనూ మూడు నాలుగు చిత్రాలు చేశారు.

అలాంటిది ఇటీవల తెరపై కనిపించనేలేదు. ఈ గ్యాప్‌కు కారణం కథలు నచ్చకపోవడమే. అలా స్టార్‌ హీరోల చిత్రాలను కూడా సున్నితంగానే తిరస్కరించారనే ప్రచారం ఉంది. అయితే తాజాగా ఓకేసారి రెండు చిత్రాలు చేస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి శివకార్తికేయన్‌ సరసన నటిస్తున్న చిత్రం. దీన్ని నటుడు కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తుండడం విశేషం. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ రెండు నెలల పాటు కశ్మీర్‌లో జరుపుకుని ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుపుకుంటోంది.

ఇందులో తనది చాలా బలమైన పాత్ర అంటున్నారు సాయిపల్లవి. ఇక తెలుగులో నటుడు నాగచైతన్యతో రెండోసారి జత కడుతున్న చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో రూపొందిన లవ్‌స్టొరీ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అలా ఒకే సారి తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ సాయిపల్లవి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారన్నమాట.

చదవండి: పెద్ద బాధ్యతను ఎత్తుకున్న నిహారిక.. స్పెషల్ అట్రాక్షన్‌గా వరుణ్- లావణ్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement