Anudeep KV Movie: స్టార్‌ హీరోతో 'జాతి రత్నాలు' డైరెక్టర్‌ సినిమా..

Sivakarthikeyan Anudeep KV Movie SK20 In Telugu And Tamil - Sakshi

Sivakarthikeyan Anudeep KV Movie SK20 In Telugu And Tamil: శివ కార్తికేయన్‌ హీరోగా ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నారాయణ్‌ దాస్‌ నారంగ్, సురేష్‌ బాబు, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. ‘ఎస్‌కె 20’ వర్కింగ్‌ టైటిల్‌తో తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్‌ అయింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘

‘ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది’’ అని సురేష్‌ బాబు తెలిపారు. మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా సహనిర్మాతగా అరుణ్‌ విశ్వ వ్యవహరిస్తున్నారు. 

చదవండి: రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్‌ అరెస్ట్‌..
నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్‌ రావిపూడి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top